గత వారం నుంచి పెరుగుతున్న పసిడి ధరల పరుగుకు బ్రేకులు పడటంలేదు. రాఖీ పండగకు దగ్గరచేసి బంగారం ధరలకు రెక్కలు రావడంతో పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేట్లు తగ్గితే షాపింగ్ చేద్దాం అనుకున్నవారు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నట్టు తెలుస్తోంది.
‘రాఖీ’ భాయ్‌కి షాక్ ఇచ్చిన ‘బంగారమ్మ’
రాఖీ పండగకు ముందు సోమవారం గోల్డ్ రేట్లు తిరిగి పుంజుకోవడంపై వ్యాపారుల్లో ఆనందం ఏమోకానీ, కొనుగోలుదారులను షాక్ గురయ్యేలా చేసింది.
చదవండి: “తంగలాన్” వెరీ స్పెషల్ మూవీ – మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్
ప్రస్తుతం ధరలు ఇలా….
22 క్యారెట్ల బంగారం ఆదివారంతో పోల్చితే 100 గ్రాములకు రూ.2,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే…చెన్నై, ముంబై, కలకత్తా, బెంగళూరు, కేరళ, పూణె, బళ్లారిలో రూ.6,470 ఉండగా…అత్యధికంగా జైపూర్, గురుగ్రామ్, నొయిడాలలో రూ.6,485 చొప్పున ప్రస్తుతం ట్రేడవుతోంది.