అన్నికోణాల్లో ‘అభయ’ విచారణ..?
మాజీ ప్రిన్సిపల్ ఇంట్లో సీబీఐ..?
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతోపాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సీబీఐ సోదాలు జరిపింది. ఇదే కేసుకు సంబంధించి మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ వశిష్ట్‌తోపాటు మరో 13 మంది ఇళ్లలోనూ సీబీఐ అధికారులు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించి వారిని ప్రశ్నించారు. ఆస్పత్రికి సరఫరా అయ్యే ఉత్పత్తులకు సంబంధించి లావాదేవీలపై ఆరా తీశారు.
చదవండి: రాహుల్‌కు ఏమైంది..?
సంజయ్‌కు లైడిటెక్షన్ టెస్ట్..?
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌పై ఫోరెన్సిక్ నిపుణులు ఆదివారం లై డిటెక్టర్ పరీక్ష జరిపారు. ఆయన ఇప్పటివరకూ ఇచ్చిన వాంగ్మూలం అంతా నమ్మదగినగా లేదని, తప్పులు తడకగా ఉందని, ఈ క్రమంలో ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ అవసరమని సీబీఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానాన్ని అభ్యర్థించగా అందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో, మాజీ ప్రిన్సిపల్ ఘోష్‌తోపాటు మరో ముగ్గురు వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ అవసరమని న్యాయస్థానాన్ని విచారణ అధికారులు అభ్యర్థించిన విషయం విదితమే.