కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన తెలుగురాష్ట్రాల్లో నిరసనలకు దారితీసింది. పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేసిమరీ రోడ్లపైకి వచ్చారు జూడాలు. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో పీజీ వైద్యులు విధులు బహిష్కరించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
చదవండి: ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం
న్యాయం చేయకుంటే దశలవారీ ఉద్యమమే: జూడాలు
ఇక మంగళగిరి ఎయిమ్స్‌లో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయంచేయాలని నినాదాలు ఎక్కుపెట్టారు. అలాగే విజయవాడ సిద్ధార్థ కాలేజీలో వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి నుంచి రామవరప్పాడు కూడలి మీదుగా ఈఎస్‌ఐ ఆస్పత్రి వరకు ర్యాలీ సాగింది.