30ఏళ్లల్లో ఇలాంటి కేసు చూడలేదన్న జడ్జి..!

Spread the love

బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం..?
30ఏళ్లల్లో ఇలాంటి కేసు చూడలేదన్న జడ్జి..!

దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు మిన్నంటిన అభయ హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఆ మేరకు ఎప్పటికప్పుడు విచారణ చేపడుతూనే వస్తోంది. అయితే ఈ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై సుప్రీంకోర్టు మండిపడటం గమనార్హం. విచారణ విషయంలో నిబంధనలు ఏవీకూడా పాటించలేదని, ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసారంటూ దీదీ సర్కార్‌ను దుమ్మెత్తిపోసింది. 30ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని న్యాయమూర్తి జస్టిస్‌ పార్థివాలా ఒకింత అసహనం వ్యక్తంచేశారు.

చదవండి: రేవంత్..సెక్యూరిటీ లేకుండా రా..? ‘రుణ’మాఫీపై బీఆర్‌ఎస్ ‘రణం’

సుప్రీంకోర్టులో వాదనల వార్‌…?

అభయ హత్యాచారకేసు విచారణ సందర్భంగా ఇటు సీబీఐ, అటు కోల్‌కతా పోలీసుల తరఫున వాదనలు వేడిపుట్టించాయి. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా వాదనలు వినిపించగా…కోల్‌కతా పోలీసుల తరఫున కపిల్ సిబల్‌ వకల్తా పుచ్చుకున్నారు. తొలుత వాదనలు వినిపించిన తుషార్ మెహతా…ఉదయం ఘటన జరిగితే రాత్రి 11.30 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, ఆస్పత్రి వైద్యుల నివేదక ఆధారంగా నమోదుకాలేదని, కేవలం బాధితురాలి తండ్రి అభ్యర్థనకు నమోదుచేశారని తెలిపారు. అయితే సీబీఐ తరఫున వాదనలు విన్న ధర్మాసనం…ఈ కేసులో ఏఎస్పీ తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. అలాగే శవ పంచనామా ఎప్పుడు చేశారంటూ కోల్‌కతా పోలీసుల తరఫున వాదిస్తున్న కపిల్ సిబల్‌ను ప్రశ్నించగా…సాయంత్రం 4.20 గంటల తర్వాత జరిగిందని నివేదించగా, దీంతో అసహనం వ్యక్తంచేసిన ప్రధాన న్యాయమూర్తి…పోలీసులు చట్టప్రకారం వ్యవహరించలేదని, పోలీసుల చర్యలపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సీబీఐ, పోలీసుల నివేదికకు చాలా తేడా..?

సీబీఐ సమర్పించిన నివేదిక, పోలీసుల సమర్పించిన నివేదికకు చాలా తేడా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని సీబీఐని జస్టిస్ పార్థివాలా ప్రశ్నించగా…హత్యకు ముందు అభయను వేధించారని, కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా చెప్పుకొచ్చారు. ఓదశలో ఇది ఆత్మహత్య కాదు..హత్య అని కుటుంబసభ్యులు చెప్పినా పట్టించుకోలేదన్నారు. దీనికి ప్రతిస్పందించిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. సంఘటనా స్థలాన్ని ఎందుకు భద్రపరచలేదు…ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఎందుకు ఆలస్యం జరిగింది…దర్యాప్తు నిబంధనలను ఎందుకు ఈ కేసులో విస్మరించారంటూ మమత సర్కార్‌ను కోర్టు మందలించింది.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...