మంకీపాక్స్‌పై WHO కీలక ప్రకటన..?
అరికట్టే ప్రయత్నాలు కీలకమంటూ హెచ్చరిక
ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న రాకాసి వైరస్ కోవిడ్-19ను మరవకముందే ఓమూల ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది మంకీపాక్స్. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలతో అప్రమతమైన ప్రపంచదేశాలు దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఉపక్రమించాయి. మన ప్రధాని మోదీ కూడా గత ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి అప్రమత్తంగా ఉండాలంటూ దిశానిర్దేశనం కూడా చేశారు. అయితే తాజాగా WHO మంకీపాక్స్ చేసిన మరో ప్రకటన ఉలిక్కిపడేలా చేసినా, కాస్త ఊరటనిచ్చే అంశాన్ని తెలియజేసింది. కొవిడ్‌లా మంకీపాక్స్ ఉండదని…దీని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు కీలకమని WHO యూరప్ ప్రాంతీయ సంచాలకులు హన్స్ క్లుగె వెల్లడించారు.
చదవండి: విడాకులకు జెన్నీఫర్ లోపెజ్ దరఖాస్తు..?
టీకా అభివృద్ధిలో సీరమ్..!
ప్రపంచదేశాలను కలవరపరుస్తున్న మంకీపాక్స్ వ్యాధికి టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్టు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ఏడాదిలోగా దీనిపై సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఇటీవల కాలంలో ఈ వ్యాధి ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో విజృంభిస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో దీనిని ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే.