సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాకు నెగిటివ్ రిపోర్ట్ వస్తోంది. భారీ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిరాశపర్చిందంటూ అన్ని చోట్ల నుంచీ టాక్ వినిపిస్తోంది. రివ్యూస్ కూడా మొత్తం మిక్స్డ్ గా ఉన్నాయి. మహేశ్ త్రివిక్రమ్ కాంబో స్థాయికి గుంటూరు కారం ఏమాత్రం తగిన సినిమా కాదని అభిమానులే చెబుతున్నారు. ఈ సినిమా మినిమమ్ బాగున్నా…ఈ సంక్రాంతి ఊపులో మంచి కలెక్షన్స్ సాధించేది.
గుంటూరు కారం రిజల్ట్ గురించి మహేశ్ ముందే హింట్ ఇచ్చాడా అంటే..ఈ సినిమా ప్రీ రిలీజ్ లో మహేశ్ చెప్పిన మాటలు వింటే ఇది నిజమేనని అనిపిస్తోంది. మహేశ్ మాట్లాడుతూ త్రివిక్రమ్ తో కలిసి ఖలేజా చేసినప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది..ఇప్పుడు గుంటూరు కారంలోనూ అదే మ్యాజిక్ జరగబోతోంది అని చెప్పాడు. ఖలేజా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా..ఇప్పుడు గుంటూరు కారం కూడా అదే రిజల్ట్ తెస్తుందా.. చూడాలి..