రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు లోకేష్ కనకరాజ్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికే కూలీ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. రజినీ బర్త్ డే కు రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కూలీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లాంటి లోకేష్ టీమ్ అంతా కూలీ సినిమాకు వర్క్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లర్ గా రజినీకాంత్ ఈ సినిమాలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. కేవలం పది సినిమాలు చేసి రిటైర్ అవుతానని చెప్పిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు ఇది ఆరో మూవీ. తన గత చిత్రాల టైప్ లోనే మాఫియా, స్మగ్లింగ్, డ్రగ్స్ వంటి అంశాలు కూలీలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.