నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమా సంక్రాంతికి రిలీజై సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ఓటీటీ డేట్ పై ఒక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ నెల 15న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారట. సినిమా రిలీజైన నెల రోజులకు నా సామి రంగ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయంపై డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ నుంచి అఫిషీయిల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతోంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ లో దర్శకుడు విజయ్ బిన్నీ నా సామి రంగ సినిమాను రూపొందించారు. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా..ఇతర కీ రోల్స్ ను అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లాన్ చేశారు. జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చిన నా సామి రంగ స్లోగా థియేట్రికల్ జర్నీ స్టార్ట్ చేసింది. మిక్స్డ్ టాక్ లో బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కింది.