పాన్ ఇండియా స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. అలాంటి ప్రభాస్‌ను జోకర్ అంటూ నోరుపారేసుకున్నారు బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ. కల్కిను ఉద్దేశించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమితాబ్‌తో పోల్చితే ప్రభాస్ తేలిపోయాడన్నారు. అయితే ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలతో డార్గింగ్ ఫాన్స్ రగిలిపోతున్నారు. కాగా,
మొన్నీమధ్యే బిగ్‌స్క్రీన్‌పై విడుదలై త్వరలో ఓటీటీకి కూడా రాబోతున్న ఈ మూవీ వెయ్యికోట్లపైనే కలెక్ట్ చేసిన విషయం విదితమే.
ప్రభాస్ లేకుండా బాహుబలి ఊహించలేం
కొనియాడిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో క్షత్రియ సేవాసమితి నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొని సినిమా రంగంలో రాజుల ప్రతిభను ఆకాశానికెత్తేశారు. బాహుబలిని ప్రభాస్ లేకుండా ఊహించుకోవడం కష్టమన్న ఆయన…ఆయన పెదనాన్న కృష్ణంరాజు పేరు ఉచ్చరించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేమని స్మరించుకున్నారు. అలాగే రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్‌లో సత్తా చాటి తెలుగోడి గొప్పతనాన్ని ఉత్తర భారతీయులకు తెలియజేశారన్నారు సీఎం రేవంత్.