యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. హిట్ 2 తో సక్సెస్ అందుకున్న మీనాక్షి…గుంటూరు కారం సినిమాలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో రాజీ క్యారెక్టర్ లో మహేశ్ మరదలుగా మీనాక్షి కనిపించబోతోంది. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కు రెడీ అవుతుండగానే…మరో క్రేజీ ప్రాజెక్ట్ కు మీనాక్షిని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, ఒక నాయికగా మీనాక్షిని తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు ఆర్సీ 16 వెళ్లనుంది. రామ్ చరణ్ తో సినిమా దక్కితే మీనాక్షి నెక్ట్ లెవెల్ కు వెళ్లినట్లే అనుకోవాలి.