డెబ్యూ డైరెక్టర్స్ తో మూవీస్ చేస్తుంటాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తన కొత్త మూవీని కూడా ఓ డెబ్యూ డైరెక్టర్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దిల్ రూబా అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేశారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దిల్ రూబా సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమా ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న దిల్ రూబా సినిమాను ఈ సమ్మర్ కే రిలీజ్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి యంగ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన ఓ సూపర్ హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.