కల్కితో తన పాన్ ఇండియా స్టార్ డమ్ చూపించారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ తోనూ అది మరోసారి ప్రూవ్ అవుతోంది. నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన రాజా సాబ్ గ్లింప్స్ డిజిటల్ వ్యూస్ లో దూసుకెళ్తోంది. ఈ గ్లింప్స్ ఇప్పటికే 15 మిలియన్స్ కు పైగా డిజిటల్ వ్యూస్ సాధించింది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించడం గ్లింప్స్ లో హైలైట్ అయ్యింది.
చదవండి: “కన్నప్ప”లో చెంచు వీరనారిగా మధుబాల
“రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ టైమ్ రొమాంటిక్ హారర్ జానర్ లో ప్రభాస్ ను చూపించనుంది “రాజా సాబ్”. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజా సాబ్ విడుదల కానుంది.