35 చిన్న కథ కాదు రివ్యూ
హీరో : విస్వదేవ్
హీరోయిన్ : నివేదా థామస్
కీలక పాత్రల్లో: ప్రియదర్శి, భాగ్య రాజా, గౌతమి
నిర్మాతలు: రానా దగ్గుబాటి , సృజన్ యెర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి
దర్శకత్వం : నంద కిషోర్ ఈమని.
మధ్య తరగతి కథలు ఎప్పుడూ సేల్ అవుతూనే ఉంటాయి..అదే కోవలో వచ్చిన సినిమానే 35 చిన్న కథ కాదు…చెప్పుకోవడానికి చిన్న కథ అయినా ప్రతి ఇంట్లో జరిగిన కథే, జరుగుతున్న కథే అందుకే..ఈ కథ ప్రతి ఇంటి డోర్ కొడుతుంది..ప్రతి వాళ్ల మనస్సు ను సున్నితం గా తాకుతుంది…సినిమా చూసిన ప్రతి వారికి వాళ్ళు చిన్నతనం లో చేసిన ఏదో ఒక విషయం లో కనెక్ట్ అవ్వకమానరు. కొన్ని సన్నివేశాలు..ఇది నాకు జరిగిందే అనిపిస్తాయి…కొన్ని సన్నివేశాలు గుండెను బరువు ఎక్కిస్తాయి..ఓవరాల్ గా సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో ఆలోచింపచేస్తాయి….అదే ’35 చిన్న కథ కాదు’
పలు దర్శకుల దగ్గర స్క్రిప్ట్ వర్క్ లో పని చేసిన నంద కిషోర్ ఈ సినిమా ద్వారా దరకుడి గా పరిచయం కాబోతున్నారు…చక్కటి కథ, ఆ కథకి సరిపోయే ఆర్టిస్టులను చక్కగా వెతికి పట్టుకొని …తన లిమిట్స్ లో నీట్ గా సినిమాను తెరకెక్కించారు.. దర్శకుడిగా నంద కిషోర్ కు మంచి మార్కులే పడతాయి..ఇక ప్రసాద్ పాత్రలో విశ్వదేవ్ ఒదిగిపోయారు…తిరుమల లో బస్ కండెక్టర్ గా తన పాత్రకు న్యాయం చేశారు…ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఎలా ఉంటాడో విశ్వదేవ్ తన ఆహ భావాలతో అందరినీ మెప్పించాడు…బేసిగ్గా విశ్వదేవ్ ది వైజాగ్ అయినా, చిత్తూరు భాషను బాగానే పలికాడు…
చదవండి: తేజ్ మూవీకి, మహేష్ పాటకి.. లింక్
ఇక సినిమాలో ఇంకో ముఖ్యమైన పాత్ర గురుంచి చెప్పాలి అంటే అది చాణక్య ( ప్రియదర్శి) తన పాత్రకు ప్రాణం పోసాడు.ప్రతి స్కూల్ ఇటువంటి మాస్టర్ ఒకరు ఉంటారు..ఆయన తన స్టూడెంట్స్ ను పేర్ల తో కాకుండా.. వాళ్ళుకు లెక్కల్లో వచ్చిన మార్కులతో పిలుస్తూ ఉంటారు…లెక్కల మాస్టారుగా ప్రియదర్శి మరో సారి ప్రూ చేసుకున్నాడు..హీరో అయినా, చిన్న పాత్ర అయినా దానికి 100% ఎలా ఇవ్వాలో ప్రియదర్శి కి బాగా అర్థం అయ్యింది..అందుకే ఆ పాత్రలో ఒదిగిపోయారు..
ప్రిన్సిపాల్ గా భాగ్యారాజా బాగా చేశారు..చాలా రోజుల తరువాత ఆయన్ని స్క్రీన్ మీద చూడటం హ్యాపీ గా అనిపించింది..గౌతమికి ఫెర్ఫర్మెన్స్ ఉన్న పాత్ర దొరికింది..సరస్వతి కి గురువుగా.. మెంటర్ గా మంచి పాత్ర చేశారు గౌతమి..
ఇక సరస్వతి పాత్ర చూస్తుంటే..మనకు మన అమ్మే గుర్తుకువస్తుంది… సరస్వతి పాత్ర లో నివేధా థామస్ ప్రాణం పోశారు…ఆ పాత్ర తను తప్ప ఎవ్వరూ చేయలేరు అనేవిధంగా చేసి మెప్పించింది…మధ్య తరగతి మహిళ తన కొడుకు కోసం ఏమి చేసింది అన్నదే సినిమాలో చూడాలి…ప్రెస్మీట్ లో ఈ పాత్ర నేను మిస్ అయ్యి ఉంటే లైఫ్ చాలా మిస్ అయ్యేదాన్ని అని ఎందుకు అన్నారో సినిమా చూస్తే అర్ధం అవుతుంది…
కథ విషయానికి వస్తే తిరుపతి నుండి తిరుమల కు వెళ్ళే బస్ లో కండక్టర్గా ప్రసాద్ ( విస్వదేవ్) పని చేస్తుంటారు
. అతని మరదలు సరస్వతి..10 తరగతి తప్పి , బావ అంటే ఇష్టం తో ..బావను పెళ్ళి చేసుకుంటుంది..వాళ్ళకి ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్…అందులో అరుణ్ కి లెక్కలు అంటే ఇష్టం ఉండవు…లెక్కల మాస్టారు చాణక్య ( ప్రియదర్శి) తనను జీరో అని పిలిచి , చివరి బెంచ్ లో కూర్చో బెడతాటు..ఆ మధ్యలో చిన్న..చిన్న తప్పుల వల్ల అరుణ్ ను క్లాస్ నుండి సస్పెండ్ చేస్తారు..చాణక్య, ప్రిన్సిపాల్ కలసి మీ వాడికి లెక్కల్లో 35 మార్కులు వస్తేనే మా స్కూల్ లో ఉంటాడు..లేకపోతే ఉండడు అని చెబుతారు..ఆ టైమ్ లో ప్రసాద్ అరుణ్ ను వేద విద్య నేర్చుకుంటే బాగుంటుంది అని , రేపు స్కూల్ కు వెళ్ళవద్దు…వేద విద్యకు పంపుదాం అని సరస్వతి చెబుతాడు..కానీ సరస్వతి మళ్ళీ అరుణ్ ను స్కూల్ కి పంపడం వలన మళ్ళీ స్కూల్ నుండి బయటకు పంపుతారు..నా పరువు పోతుంది..నా పరువు పోయే పని చేసారు అని భార్య తో మాట్లాడటం మానేస్తాడు..10 ఫెయిల్ అయిన సరస్వతి కొడుకును ఎలా చదివించింది..చివరకు భార్యా, భర్తలు మాట్లాడుకున్నరా, అరుణ్ కి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తెలియాలి అంటే 35 చిన్న కథకాదు చూడాల్సిందే..
ప్రతి ఇంట్లో జరిగే కథే
రేటింగ్ 2.75/5