రెబెల్ స్టార్ ప్రభాస్ ఐకానిక్ మూవీ బాహుబలి రిలీజ్ అయ్యి 9 ఏళ్లవుతోంది. 9 ఇయర్స్ ఆఫ్ బాహుబలి అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2015 జూలై 10న బాహుబలి మొదటి భాగం రిలీజైంది. అప్పటికే ఈ మూవీకి విపరీతమైన హైప్ ఉండటంతో థియేటర్స్ వద్ద జాతర సాగింది.
బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశమంతా మార్మోగింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందించాడు. లక్షలాది మంది సినీ ప్రియుల అంచనాలను అందుకోగలిగింది బాహుబలి. ఈ సినిమాకు వచ్చిన సెకండ్ పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.