ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో
అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ కథ ఓకే అయిన తరువాత ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాం. ‘ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తాం.. ఆ తరువాత సినిమా బాగుంటేనే ఆడుతుంది.. ఎవరి కష్టం వారిదే.. సినిమా కథ బాగుందని అంటున్నారు.. చేసేయండి’ అని ఎన్టీఆర్ అన్నారు. నితిన్ ఈ చిత్రంలో ఎంతో ఈజ్‌తో నటించాడు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేద్దామని అజయ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి బన్నీ వాస్ చెప్పాడు. లిరిసిస్ట్ సురేష్ గారు మంచి పాటలు ఇచ్చారు. మా బ్యానర్లో కష్టం వస్తే.. చైతన్య గారు ముందుకు వస్తారు. మా సినిమాను ఆడియెన్స్ వరకు మీడియా తీసుకెళ్లాలని కోరుతున్నాను’ అని అన్నారు.
చదవండి: డార్లింగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘మేం మంచి గోదావరి సినిమాను తీశాం. మంచి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పాం. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంత మంచి చిత్రంలోకి నన్ను తీసుకున్న అంజి గారికి, బన్నీ వాస్ గారికి, అల్లు అరవింద్ గారికి థాంక్స్. రామ్ మిర్యాల, అజయ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంకిత్, చౌదరి గార్లు మంచి సపోర్ట్ ఇచ్చారు. అంజి గారు కథ చెబుతుంటేనే నాకు సినిమా కనిపించింది. మూడు గంటలు నెరేషన్ వింటే.. నవ్వుతూనే ఉన్నాను. ఆడియెన్స్ కూడా అలానే నవ్వుతూనే ఉంటారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ..ఈ చిత్రం అందరినీ నవ్విస్తుంది. మీమర్స్‌కు మంచి కంటెంట్ దొరుకుతుంది. నితిన్, అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. మూడు పాత్రలకు మంచి స్కోప్ ఉంటుంది. మ్యాడ్ బాగా ఆడుతోంది.. ఈ సినిమా ఒప్పుకుంటాడా? లేదా? అని అనుకున్నాను. సినిమా కథ బాగుంది.. నేను ఒక అప్ కమింగ్ హీరోని.. అలాంటి వాడికి మంచి సినిమా దొరికితే అంతే చాలు కదా అని అన్నారు. అలా నితిన్ అన్నప్పుడు నాకు రేసుగుర్రంలో బన్నీ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. సినిమా బాగుంటే చాలు పాత్రల గురించి పట్టించుకోవద్దు అని బన్నీ అంటారు.’ అని అన్నారు.
దర్శకుడు అంజి కె.మణిపుత్ర మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు గోదావరి ప్రాంతాన్ని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలన్నింటిల్లోకెల్లా ది బెస్ట్ చిత్రం అవుతుంది. నితిన్ నార్నే ఎంతో సహజంగా నటించారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు. అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. అజయ్ గారు మంచి పాటలు ఇచ్చారు. బన్నీ వాస్ ఆల్ రౌండర్.ఆయన లేకపోతే ఈ చిత్రం లేదు. అమ్మాయిలను నేచర్‌తో పోల్చుతాం. అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. మా ఆయ్ చిత్రం కూడా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు.