ఐశ్వర్యరాయ్ తో తాను విడాకులు తీసుకున్న రూమర్స్ పై స్పందించారు హీరో అభిషేక్ బచ్చన్. తాము కలిసే ఉన్నామని సూచించేలా చేతికున్న వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఐష్ తనతోనే ఉందని ఇలా తెలియజేశారు అభిషేక్. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నట్లు వార్తలు బాగా వస్తున్నాయి.
చదవండి: మెస్మరైజింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న సూర్య ‘కంగువ’ ట్రైలర్
ఐశ్వర్యతో విడాకుల గురించి అభిషేక్ మాట్లాడినట్లు ఓ డీప్ ఫేక్ వీడియో కూడా క్రియేట్ చేసి వైరల్ చేశారు. వీటిపై స్పందించారు అభిషేక్ బచ్చన్. తాము సెలబ్రిటీలం కాబట్టి ఇవన్నీ భరించక తప్పదు అంటూ అభిషేక్ రియాక్ట్ అయ్యాడు. కలిసి నటించిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.