బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూసింది. ఆమె వయసు 32 ఏళ్లు. గత కొంతకాలంగా పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతోంది. గురువారం రాత్రి ఆమె కన్నుమూసినట్లు ఆమె పర్సనల్ స్టాఫ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయంలో పూనమ్ కుటుంబానికి సపోర్ట్ గా నిలవాలంటూ ఆమె టీమ్ పోస్ట్ చేసింది.
మోడల్ గా సెన్సేషనల్ అయ్యింది పూనమ్ పాండే. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ టైమ్ లో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. నషా అనే సినిమాతో 2013లో సినిమాల్లోకి వచ్చింది పూనమ్. ఆ తర్వాత కొన్ని రియాల్టీ షోస్ లో పాల్గొంది. పూనమ్ పాండే మృతి పట్ల పలువురు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.