రీల్‌లో గుడ్, రియల్‌లైఫ్‌లో ఖతర్నాక్స్..!
మోసంచేశాడని హీరో శ్రీతేజ్‌పై యువతి కంప్లైంట్..!
హీరో శ్రీతేజ్… విభిన్న పాత్రలు ఎంచుకోవడంలో మేటి. మొన్నటి ఎన్నికలకు ముందు ఓ చిత్రంలో చంద్రబాబు క్యారెక్టర్ చేసి అందరికీ గుర్తుండిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడాయనకు చిక్కులొచ్చిపడ్డాయి. పెళ్లిచేసుకుంటానని శ్రీతేజ్ మోసం చేశాడంటూ ఓ యువతి రోడ్డెక్కింది. ఈ మేరకు హైదరాబాద్ కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు అయింది. బాధిత యువతి కంప్లైంట్ మేరకు బీఎన్ఎస్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
ఇదిలాఉంటే, కూకట్‌పల్లి పోలీసులు మరింత సమాచారాన్ని మీడియా ముందుంచారు. హీరో శ్రీతేజ్‌పై కంప్లైంట్ ఇదొక్కటే కాదని, గతంలోనూ మరో కేసు కూడా నమోదై ఉందని గుర్తుచేశారు. హీరో శ్రీతేజ్‌పై మాదాపూర్ స్టేషన్‌లో కేసు నమోదై ఉందన్న కూకట్‌పల్లి పోలీసులు..ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇది తెలిసి సదరు మహిళ భర్త గుండెపోటుతో మృతిచెందాడని తెలిపారు.
ఏదైమైనా, తాము చేసిన చిత్రాల్లో గుడ్‌బాయ్ క్యారెక్టర్స్ ఎంచుకుని ప్రజల మదిలో మంచి అబ్బాయిలుగా నిలిచిపోయిన శ్రీతేజ్ లాంటివాళ్లు కేవలం రీల్ వరకే మాత్రమేనని, రియల్ లైఫ్‌లో బ్యాడ్‌బాయ్స్ అని తాజా ఘటనలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్నామధ్య పుష్ప-1లో హీరో బన్నీకి స్నేహితుడిగా కేశవ క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన జగదీశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ అమ్మాయిని బ్లాక్ మెయిలింగ్ చేసి..ఆమె మరణానికి కారణమయ్యాడన్న ఆధారాలతో నటుడు జగదీశ్ కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న రీతిలో పుష్ప-2లో హీరో బన్నీ పక్కన కీలక సన్నివేశాలు ఉండటంతో సదరు మూవీ మేకర్స్ సుమారు రూ.30లక్షలు ఖర్చుపెట్టిమరీ జగదీశ్‌ను విడిపించుకున్నారన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
ఇక, కొరియోగ్రాఫర్ జానీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదుతో చంచలగూడ జైలులో ఖైదుగా గడిపి ఈ మధ్యనే బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.