నటుడు తొట్టెంపూడి వేణుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్లు. ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు వెంకట సుబ్బారావు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం, వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఉదయం శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
వెంకట సుబ్బారావు భౌతిక కాయాన్ని బంధుమిత్రులు సందర్శనార్థం మధ్యాహ్నం ఇవాళ 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో ఉంచుతారు. 1 గంట తర్వాత జూబ్లీహిల్స్, మహాప్రస్థానం లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హీరోగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వేణు…ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఇటీవల వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.