నటి నమితకు చేదు అనుభవం
తెలుగులో సొంతం సినిమాలో మల్లెతీగల కనిపించి, తమిళనాట బొద్దుగుమ్మగా ఒక ఊపేసి, పైగా ఆమెకంటూ గుడులు కట్టేసే ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి నమితకు తమిళనాడులోని ఓగుడిలో చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా మధురై మీనాక్షి టెంపుల్‌కి దర్శనం నిమిత్తం కుటుంబసభ్యులతో వెళ్లిన ఆమెను అడ్డుకున్నారు.
చదవండి: జనసేన వర్సెస్ బన్నీ మామ..
నన్ను అడ్డుకున్నవాళ్లని శిక్షించాలి..?
మధురై మీనాక్షి ఆలయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వెల్లిబుచ్చారు నటి నమిత. అమ్మవారి దర్శనంకోసం వెళ్లిన తనను, తన కుటుంబసభ్యులనూ దేవాలయ సిబ్బంది హిందూ కులధ్రువీకరణ పత్రం అడిగారని…పైగా సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని వాపోయారు. తాను పుట్టుకతో హిందువునని, తనపై అగౌరవంగా ప్రవర్తించిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలంటూ నటి నమిత ఓ భావోద్వేగపూరిత వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram