హీరో అడివి శేష్ తన స్పై థ్రిల్లర్ గూఢచారి ఆరో యానివర్సరీ సందర్భంగా ఫ్యాన్స్ కోసం ట్విట్టర్ లో థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్స్ చేశారు. స్టన్నింగ్ మూమెంట్స్ తో పోస్ట్ చేశారు. గూఢచారి కి సీక్వెల్ గా రూపొందుతున్న G2 40% షూటింగ్ పూర్తి కావడంతో, మేకర్స్ సినిమాలోని ఆరు స్టైలిష్ యాక్షన్ మూమెంట్‌లను రిలీజ్ చేశారు. ఇవి ప్రత్యేకంగా నిలిచే స్పై థ్రిల్లర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి.
చదవండి: బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేసిన మహిళ
2025 సెకండ్ హాఫ్ లో గ్రాండ్‌గా విడుదల కానున్న G2 అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. “గూఢచారి సినిమా చాలా ప్రత్యేకమైనది. గత 6 సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రశంసలు వింటూనే వున్నాను. G2 బిగ్గర్ అండ్ ఇంటర్ నేషనల్ స్కేల్ లో వుంటుంది. గూఢచారి అభిమానులందరికీ G2 ఒక మ్యాసీవ్ విజువల్ ట్రీట్ అవుతుంది’ అన్నారు.