రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఆలస్యమైనా మంచి ఔట్ పుట్ కోసం టీమ్ శ్రమిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షెడ్యూల్ ఒకటి హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్, కియారా లేరు. మిగతా ఆర్టిస్టులతో షెడ్యూల్ ముగించారు.
గేమ్ ఛేంజర్ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రామ్ చరణ్, కియారా అద్వానీ సంక్రాంతి తర్వాతే సెట్ లో అడుగుపెడతారట. ఈ సినిమాలోని ఓ డ్యూయెట్ ను కియారా, చరణ్ మీద సంక్రాంతి తర్వాత చిత్రీకరిస్తారని తెలుస్తోంది. జనవరి 17 నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.