తమిళ ఫిలిం ఇండస్ట్రీలో అజిత్ కెరీర్ అర్థం కాదు. అతని స్టార్ డమ్ ఏంటో, ఆ చేసే సినిమాలేంటో ఓ పట్టాన మింగుడుపడవు. మళ్లీ కోలీవుడ్ లో నాలుగో పెద్ద స్టార్ నేనే అంటాడు అజిత్. తమిళంలో ఏమో గానీ తెలుగులో ఈ హీరో జీరో. అతని సినిమాలపై పైసా సంపాదించిన డిస్ట్రిబ్యూటర్, నిర్మాత లేడు. పైగా పాన్ ఇండియా స్టార్ లా అజిత్ ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు.
ఇప్పుడు అలాగే విడాముయర్చి అనే సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇది కూడా తప్పకుండా తెలుగులోకి వస్తుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ లో దర్శకుడు మగిల్ తిరుమేని రూపొందించారు. త్రిష హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడముయర్చి నుంచి అజిత్ లుక్ రిలీజ్ చేశారు. ఆయన గత పది సినిమాల లుక్స్ చూస్తే..ఏది ఏ సినిమాదో చెప్పలేం. ఇవన్నీ తెలిసీ మైత్రీ మూవీ మేకర్స్ అజిత్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.