యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్గా పేరు మార్చుకున్న తరువాత మొదలైన మొదటి సినిమా ఇది. ఇక సినిమా వాళ్ల కు సెంటిమెంట్స్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఆకాష్ పూరి నుండి ఆకాష్ జగన్నాథ్ మారాడు ఈ యంగ్ హీరో. ఇదిలా ఉంటే , ఆకాష్ జగన్నాథ్ హీరోగా తల్వార్ అనే సినిమా ఈ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ తల్వార్ సినిమా పూజా కార్యాక్రమాలు జరిగాయి. ప్రముఖ రచయిత విజేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వడం జరిగింది. హీరో కార్తికేయ స్క్కిప్ట్ను హ్యాండోవర్ చేసారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. మరో దర్శకుడు బుచ్చిబాబు సానా ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు.
పవర్ ఫుల్ టైటిల్తో రానున్న ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై
ఇ.ఎల్.వి భాస్కర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కాశీ పరుశరామ్ దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమాకు త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు . సంగీతం కేశవ కిరణ్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది అంటున్నారు చిత్ర యూనిట్.. హీరోయిన్ మరయు ఇతర నటీనటుల విషయాలు త్వరలోనే తెలయజేస్తాం అంటున్నారు దర్శక, నిర్మాతలు