యంగ్ హీరో ఆకాష్ పూరి తన పేరు మార్చుకున్నారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా ఆకాష్ జగన్నాథ్ గా ఇకనుంచి తనను పిలవాలని ఆకాష్ పూరి కోరారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి.
చదవండి: ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం “క” సినిమా
హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్ హీరో తన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇకపై తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా పెట్టుకుంటున్నట్లు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన కొత్త మూవీస్ లైనప్ చేసుకుంటున్నారు ఆకాష్ జగన్నాథ్.