అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటిదాకా డిజిటల్ ప్రీమియర్, శాటిలైట్ టెలికాస్ట్ కు నోచుకోలేదు. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతకు మధ్య ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఏజెంట్ ఓటీటీ, శాటిలైట్ ప్రసారాలపై స్టే ఉంది. ఇప్పటికీ ఈ స్టే కొనసాగుతోంది. అయితే హిందీలో ఇలాంటి నిబంధన ఏదీ లేదు కాబట్టి అక్కడ టీవీ ప్రీమియర్ కు రెడీ అయ్యింది
గోల్డ్ మైన్స్ ఛానెల్ ఈ నెల 28వ తేదీన ఏజెంట్ హిందీ వెర్షన్ ప్రసారం చేయబోతోంది. ఈ విషయాన్ని గోల్డ్ మైన్ టీవీ ప్రకటించింది.ఈ స్పై థ్రిల్లర్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అఖిల్ తో పాటు మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది ఏప్రిల్ 28న థియేటర్‌లో విడుదలైంది ఏజెంట్.