అక్కినేని ఇంటినుంచి మరో పెళ్లివార్త..!
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్..!
అక్కినేని నాగార్జున అతి దగ్గర్లోనే ఇద్దరు కోడళ్లకు మావయ్య కాబోతున్నారు. డిసెంబర్ 4న పెద్దకుమారుడు నాగ్ చైతన్య పెళ్లి శోభితతో జరగబోతుందన్న విషయం తెలిసిందే. ఓ వైపు అక్కినేని ఇంట్లో చైతూ పెళ్లి సందడి కొనసాగుతుండగానే, మరోవైపు చిన్నకుమారుడు అఖిల్ పెళ్లి వార్త కూడా రానే వచ్చేసింది. సీక్రెట్‌గా కొంతమంది సన్నిహితుల మధ్య జైనబ్ రావడ్జీతో అఖిల్ నిశ్చితార్థం కానిచ్చేశారట నాగార్జున. అయితే నేరుగా నాగార్జునే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని..జైనబ్‌ను కోడలిగా తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు కింగ్.
అయితే చైతూ చేసుకోబోయే శోభిత గురించి అందరికీ కొద్దోగొప్పో క్లారిటీ ఉన్నా…నాగార్జున చిన్న కోడలు జైనబ్ రావడ్జీపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అందరూ తెగ చర్చించుకుంటున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లోకి వెళ్లి వెతకడం ప్రారంభించేశారు. జైనబ్ రావడ్జీ మరెవరో కాదు…ఆమె తండ్రి జుల్ఫీ రావడ్జి గత ప్రభుత్వంలో జగన్‌కు సలహాదారుడిగా పనిచేశారు. ఈయన పక్కా హైదరాబాదీ. జుల్ఫీ రావడ్జీ కుటుంబానికి రాజకీయపరంగానూ, వ్యాపార పరంగానూ లింకులు ఉన్నాయని ఆయన గురించి తెలిసివారు చెబుతుంటారు. గల్ఫ్‌లోనూ జుల్ఫీ రావడ్జీకి వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపార పరంగా నాగార్జునతో జుల్ఫీ రావడ్జీకి మంచి సంబంధాలు ఉండటమే…త్వరలో జరగబోయే అఖిల్-జైనబ్‌ల వివాహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.