బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త సినిమా లవ్ అండ్ వార్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వికీ కౌశల్ మరో కీ రోల్ లో కనిపించనున్నారు. గంగూభాయ్ కథియావాడి సినిమా తర్వాత ఆలియాతో సంజయ్ లీలా భన్సాలీ చేస్తున్న రెండో సినిమా ఇది.
ఈ సినిమా యాక్షన్ బేస్డ్ లవ్ డ్రామాగా ఉండనుంది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలన్నీ సహజంగా భారీ మేకింగ్ తో రూపొందుతుంటాయి. లవ్ అండ్ వార్ కూడా హ్యూజ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ తో పాటే రిలీజ్ డేట్ కు ప్రకటించారు. వచ్చే క్రిస్మస్ పండుగకు లవ్ అండ్ వార్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.