హీరోగా అల్లరి నరేష్ పేరు తెచ్చుకున్నది స్ఫూఫ్ సినిమాలతోనే. అయితే అదే స్ఫూఫ్ సినిమాలు ఆయనకు బ్యాడ్ ఫేమ్ కూడా తీసుకొచ్చాయి. కొన్ని సినిమాల్లో స్ఫూఫ్స్ వర్కవుట్ అయి సక్సెస్ రాగానే..ఇక దర్శక నిర్మాతలంతా ఆయనతో అవే టైప్ సినిమాలు చేయించారు. దీంతో ఆయనతో పాటు ప్రేక్షకులకూ విసుగొచ్చింది. వరుసగా సదరు సినిమాలన్నీ బోల్తా పడటం మొదలయ్యాయి. లేట్ గా రియలైజ్ అయిన అల్లరి నరేష్..ఇక స్ఫూఫ్ సినిమాలు చేయను అని డిసైడ్ అయ్యారు.
నాందితో సీరియస్ మూవీ చేసి హిట్ కొట్టారు. ఆ తర్వాత చేసిన ఉగ్రం సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో రీసెంట్ గా నాగార్జున నా సామి రంగ మూవీలో కీ రోల్ చేశారు నరేష్. ఈ సినిమా పేరు తెచ్చింది. ఈ సక్సెస్ కొనసాగిస్తూ…తనకు గతంలో కలిసొచ్చిన స్ఫూఫ్ ఫార్ములాతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు అల్లరి నరేష్. ఇందుకు తన గత సూపర్ హిట్ మూవీ సుడిగాడుకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సుడిగాడు 2 సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.