అల్లరి నరేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఇప్పుడు చిత్రబృందం అధికారికంగా జూలై 27న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించింది. “ఫ్యామిలీ డ్రామా” చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు.
చదవండి: “విరాజి”లో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంది – దర్శకుడు ఆద్యంత్ హర్ష
వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రుహాని శర్మ అల్లరి నరేష్ సరసన నటించనుంది.