మరో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్..!
రెమ్యునరేషన్‌లో ప్రభాస్‌ను దాటేసిన బన్నీ..!
తెలుగు ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్‌ను మించిపోయాడు మన పుష్పరాజ్. ఈ ఏడాది అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలలో దేశవ్యాప్తంగా బన్నీనే నిలవడం గమనార్హం. 2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టాప్ 10 హీరోల లిస్టును ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. పాన్ ఇండియా లెవల్‌లో గరిష్టంగా పుష్ప-2 మూవీకి సంబంధించి బన్నీ రూ.300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలిపింది.
ఇక మిగతా హీరోల రెమ్యునరేషన్ విషయానికి వస్తే…తమిళ హీరో విజయ్, బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ తలో రూ.275కోట్లు తీసుకుంటుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.270కోట్లు..ఆ తర్వాత మన డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రూ.200 కోట్లు చొప్పున రెమ్యునరేషన్ సాధించారు. ఇక అజిత్ రూ.165కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.150 కోట్లు, కమల్‌హాసన్ రూ.150 కోట్లు, అక్షయ్ కుమార్ రూ.145 కోట్లు తీసుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది.
ఇదిలాఉంటే, ఇప్పటివరకు తెలుగు హీరోల రెమ్యునరేషన్ లిస్టులో ప్రభాస్ పేరు మార్మోగిపోగా, ఇప్పుడా చరిత్రను తిరగరాసాడు బన్నీ. ఏకంగా రూ.300కోట్లు రెమ్యునరేషన్‌తో పాన్ ఇండియా లెవల్‌లో టాప్ పొజిషన్‌కు చేరిపోయాడు అల్లు అర్జున్.