పితృ వియోగంతో బాధపడుతున్న నిర్మాత ఎస్ కేఎన్ ను పరామర్శించారు హీరో అల్లు అర్జున్. ఇవాళ హైదరాబాద్ లోని ఎస్ కేఎన్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయన్ని ఓదార్చారు. ఎస్ కేఎన్ తండ్రి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ నెల 4వ తేదీన ఎస్ కేఎన్ తండ్రి గాదె సూర్యప్రకాశ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ రోజున చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ఎస్ కేఎన్ కు సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియా సందేశాలు పంపించారు.
ఈ సందర్బంగా ఎస్ కేఎన్ సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పారు. ఎస్ కేఎన్ స్పందిస్తూ – ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి రావడం మా కుటుంబానికి అంతటికీ చాలా ఓదార్పునిచ్చింది. ఇలాంటి కష్ట సమయంలో మా ఇంటికి వచ్చి, నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాన్నగారికి అల్లు అర్జున్ నివాళులు అర్పించారు. అని పేర్కొన్నారు.