హీరోయిన్ అమలాపాల్ తను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది. ఆమెకు పెళ్లై రెండు నెలలే అవుతోంది. ఈలోగా తాము ముగ్గురం అంటూ భర్తతో కలిసి ఫొటో షేర్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో అమలాపాల్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. తన ప్రియుడు జగత్ దేశాయ్ ని అమలాపాల్ రెండు నెలల కిందట పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ గురించి తెలిసిన తర్వాతే ఈ హీరోయిన్ పెళ్లికి సిద్ధమైందని అనుకోవచ్చు.
అమలాపాల్ 2014 లో దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల కాపురం తర్వాత 2017లో వీరు విడిపోయారు. ఆ తర్వాత గతేడాది తన స్నేహితుడు జగత్ దేశాయ్ ను వివాహం చేసుకుంది అమలాపాల్. బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పిట్టకథలు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అమలాపాల్ బాగా పరిచయమే. ఆమె డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు తెరపైకి విరివిగా వచ్చాయి.