హీరో ఎవరన్నది కాదు..కంటెంట్ కింగ్ అనేది ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. బాగా బిజీగా మారిన ఆడియెన్స్ సినిమా బాగుంటే తప్ప థియేటర్స్ కు కదలడం లేదు. అలాంటి కంటెంట్ తో ఇంప్రెస్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో బుకింగ్స్ నిండిపోయాయి. సినిమా బాగుందనే టాక్ తో కలెక్షన్స్ ఊపందుకున్నాయి.
డే 1 కలెక్షన్స్ లో ఇది క్లియర్ గా తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపు 2.50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుని బ్లాక్ బస్టర్ దిశగా జర్నీ మొదలుపెట్టింది. యూఎస్ లో 100కె డాలర్స్ ఆల్రెడీ వచ్చేశాయి. ఓవర్సీస్ లోనూ అంబాజీపేట మ్యారేజి బ్యాండుకు బిగ్ సక్సెస్ దక్కుతుందని ఈ వసూళ్లు ఇండికేట్ చేస్తున్నాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు నిర్మాత ధీరజ్, దర్శకుడు దుశ్యంత్, హీరో సుహాస్, హీరోయిన్ శివాని, కీ రోల్స్ చేసిన నితిన్, శరణ్య కష్టం ఫలించినట్లే తెలుస్తోంది.