సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. రేపు ఉదయం 11 గంటలకు “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు.
కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘గుమ్మా..’, ‘మా ఊరు…’ లిరికల్ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ మీద కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.