యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న’పొట్టేల్’ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్ లో నేచురల్ గా కనిపించారు. ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.
చదవండి: “విరాజి” చూసి ఎమోషనల్ అయ్యా – హీరో వరుణ్ సందేశ్
బుజ్జమ్మగా అనన్య క్యారెక్టర్ ఆకట్టుకోనుంది. మూవీలో అజయ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.