నేను ట్రెండ్ అయ్యిందే పవన్ కల్యాణ్ గారి వల్ల అని కామెంట్ చేసింది నటి అనసూయ. అప్పట్లో అత్తారింటికి దారేది సినిమాలో ఐటెంసాంగ్ రిజెక్ట్ చేసి వార్తల్లో నిలిచింది అనసూయ. ఇప్పుడు ఆమె పవన్ హరి హర వీరమల్లులో నటిస్తోంది. ఈ సినిమాలో ఓ సాంగ్ లో పవన్ తో కలిసి మెరవనుంది అనసూయ. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో తాను నటిస్తున్నాని చెప్పింది.
పవన్ తో కలిసి నటించడాన్ని మర్చిపోలేనని ఆమె తెలిపింది. ఈ రోజు ఆమె కీలక పాత్రలో నటించిన సింబా సినిమా ట్రైలర్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనసూయ పాల్గొని హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాననే విషయాన్ని వెల్లడించింది. హరి హర వీరమల్లు సినిమాలో పవన్ తో కలిసి నటించడం, ఆయనతో కొంత టైమ్ గడపటం నా కెరీర్ లో మర్చిపోలేను. పవన్ రాజకీయ మార్గాన్ని ఎంచుకుని డిఫ్యూటీ సీఎం అయ్యారు. ఈ సినిమా గురించి ఎక్కువ లీక్స్ ఇవ్వలేను. అని అనసూయ చెప్పింది.