వెంకటేష్ హీరోగా మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. రూరల్ ఏరియాలో సాగే ఫన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబోలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కాయి. వీటిలో ఎఫ్ 2 మంచి సక్సెస్ కాగా..ఎఫ్ 3 కాస్ట్ ఫెయిల్యూర్ మూవీగా మిగిలింది.
అనిల్ రావిపూడి భగవంత్ కేసరి హిట్ తర్వాత రవితేజ హీరోగా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. రవితేజతో మూవీ తర్వాతే వెంకటేష్ తో సినిమా ఉంటుందట. అలాగే చిరంజీవి హీరోగా అనిల్ ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ సినిమా కూడా లైనప్ లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన స్టోరీ సెలెక్షన్ లో అనిల్ రావిపూడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటేష్ రీసెంట్ గా తన 75వ మూవీ సైంధవ్ లో నటించారు. ఈ సినిమా అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు.