చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటారు. యంగ్ డైరెక్టర్స్ అయితే ఆ అవకాశం తమకు ఎప్పుడు దక్కుతుందా అని ఎదురుచూస్తారు. అలా కోరుకున్న వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. చిరంజీవితో సినిమా చేస్తాననే డ్రీమ్ ను ఆయన గతంలోనే చాలాసార్లు చెప్పారు. ఆ డ్రీమ్ నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించనున్న 157వ సినిమాకు దర్శకుడిగా అనిల్ రావిపూడిని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా చిరంజీవికి 156వది కాగా..157వ సినిమాకు అనిల్ ను డైరెక్టర్ గా ఎంచుకున్నారట. మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, బాలకృష్ణతో భగవంత్ కేసరి వంటి భారీ ప్రాజెక్ట్స్ సక్సెస్ ఫుల్ గా డీల్ చేసిన అనిల్ రావిపూడి మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్లు సినిమా చేస్తాడని నమ్ముతున్నారు. ప్రస్తుతం అనిల్ రవితేజతో ఓ సినిమా కమిట్ అయ్యారు.