విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా యానిమల్ ఫేం త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీడీ 12గా పిలుస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఉంది. విజయ్, శ్రీలీలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో శ్రీలీల ప్లేస్ లో యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ అవుతుంది. వెంటనే వీడీ 12 సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.