రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ సినిమా ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన యానిమల్ మూవీ ఓటీటీలో చూసేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా నటించిందిి.
యానిమల్ ఓటీటీ రిలీజ్ గురించి మరో అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎక్స్ టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తారని ముందు అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడది సాధ్యం కాదని, థియేటర్ లో రిలీజ్ చేసిన వెర్షన్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ లోకి తీసుకొస్తున్నారట. ఎడిటింగ్ లో యానిమల్ ఫుటేజ్ చాలా వరకు తగ్గించారు. ఇప్పుడా తగ్గించిన ఫుటేజ్ తో కలిపి ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నా..అది ఇప్పుడు టెక్నికల్ సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.