రణ్ బీర్ కపూర్ నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు గత వారంలో 2 కోట్ల 8 లక్షల గంటల వ్యూస్ దక్కాయి. ఇది నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో టాప్ 4లో నిలిచింది. సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ మూవీ గత శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం నేటి ఆడియెన్స్ ఎలాంటి మూవీస్ చూస్తున్నారు అనే విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తోంది.
ఇక ప్రభాస్ సలార్ మూవీ ఇప్పటికీ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ మూవీస్ లో తన క్రేజ్ చూపిస్తోంది. గ్లోబల్ గా ఈ సినిమా 6వ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. థియేటర్స్ లోనూ యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ రగ్డ్ మూవీని రూపొందించారు సందీప్ వంగా. ఈ సినిమా చివరలో సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా అనౌన్స్ చేశారు. ఇటీవల ఫిలింఫేర్ అవార్డ్స్ లో యానిమల్ మూవీలో నటించిన రణ్ బీర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ గెల్చుకున్నారు.