రణ్ బీర్ కపూర్, రశ్మిక మందన్న హీరో హీరోయిన్లుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన బాలీవుడ్ మూవీ యానిమల్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమంగ్ అవుతోంది. ఓటీటీ ప్రీమియర్ లో 8 నిమిషాల అన్ సీన్ పుటేజ్ యాడ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే నెట్ ఫ్లిక్స్ లో యానిమల్ చూస్తున్న వారికి ఈ విషయంలో నిరాశే ఎదురైంది. అయితే థియేటర్స్ లో చూడని ఈ అన్ సీన్ ఫుటేజ్ ను ఓటీటీకి యాడ్ చేయలేదు.
థియేటర్స్ లో ప్రదర్శించిన సినిమానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. యానిమల్ సినిమా చూస్తున్న నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ ఫేవరేట్ సీన్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. యానిమల్ ఓటీటీలో కొత్త వ్యూయింగ్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిటిక్స్ యానిమల్, సలార్ కు మధ్య నెట్ ఫ్లిక్స్ లో పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.