సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ కలిసి నటిస్తోన్న భారీ, క్రేజీ పాన్ ఇండియా మూవీ వార్ 2. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ మూవీ డైరెక్టర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కాకుండా మరో ఇద్దరు హీరోలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు హీరోలు ఎవరు..?
చదవండి: మహేష్ మూవీ అప్ డేట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్
ఎన్టీఆర్ ఓ వైపు దేవర షూటింగ్ చేస్తూ.. మరో వైపు వార్ 2 షూట్ లో పాల్గొన్నాడు. దేవర రిలీజ్ కారణంగా ప్రమోషన్స్ చేయాలని వార్ 2 షూట్ కి బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు దేవర రిలీజ్ కావడం.. సక్సెస్ అవ్వడం తెలిసిందే. దీంతో త్వరలోనే వార్ 2 షూట్ లో జాయిన్ కానున్నాడు యంగ్ టైగర్. వార్ 2 తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ పై యాక్షన్ సీన్స్, అలాగే నాటు నాటు రేంజ్ లో ఇద్దరి పై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. దసరా తర్వాత వార్ 2 లేటెస్ట్ షూట్ స్టార్ట్ కానుందని
తెలిసింది. ఈ మూవీని నెక్ట్స్ ఇయర్ ఆగష్టు 14న రిలీజ్ చేయనున్నారు.
ఈ భారీ క్రేజీ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ తో పాటు మరో ఇద్దరు హీరోలు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా ఇద్దరు హీరోలు అంటే.. ఒకరు సల్లుభాయ్. ఈ మూవీలో మరింతగా ఆకర్షణలు జోడించాలి అనుకుంటున్నారట మేకర్స్. అందుకనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మూవీ చివరల్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారట. ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్, హృతిక్ తో పాటు సల్లుభాయ్ కూడా తెర పై కనిపిస్తే.. అభిమానులకు పండగే. మరో హీరో ఎవరంటే.. శాండిల్ వుడ్ హీరో ధృవ సర్జ కూడా ఈ మూవీలో భాగాం కానున్నాడని టాక్. మొత్తానికి వార్ 2 మూవీని అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.