ఒకరి సినిమాలు మరొకరి చేతికి చేరడం ఇండస్ట్రీలో కామనే. తాజాగా రవితేజ, విశ్వక్ సేన్ మధ్య ఇలాగే సినిమా మార్పిడి జరిగింది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ రవితేజతో ఓ సినిమా చేయాల్సిఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది.
అయితే కథ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి అనుదీప్, రవితేజ సినిమా పట్టాలెక్కలేదు. సెకండాఫ్ రవితేజకు నచ్చకపోవడంతో అనుదీప్ సినిమా హోల్డ్ లో పడింది. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతికి చేరింది. రవితేజ బదులు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. త్వరలో వీఎస్ 14గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.