ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్పై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.