అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు దేవకీ నందన వాసుదేవ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా..అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న రెండో సినిమా ఇది. దేవకీనందన వాసుదేవ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే..
ప్రతి యుగంలోనూ రాక్షసులు ఉంటారని, ఆ రాక్షసులను అంతం చేయడానికి దేవుడు వస్తాడని చెబుతూ టీజర్ ప్రారంభమైంది. రాక్షసులతో పోరాటంలో శ్రీకృష్ణుడితో పోల్చుతూ హీరోను ఎలివేట్ చేశారు. అశోక్ గల్లా ఇమేజ్ కు ఇది పెద్ద సబ్జెక్ట్. కమర్షియల్ హీరోగా అతన్ని నిలబెట్టేందుకు యాక్షన్, రొమాన్స్ వంటి ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.