అశ్విన్ బాబు (Ashwin babu) పేరు తెలుగు ప్రేక్షకులు వినే ఉంటారు. మన ఓంకార్ (Omkhar) అన్నయ్యకు తమ్ముడు. హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెటిల్ అయ్యేందుకు బాగా కష్టపడుతున్నాడు. అయితే స్టార్ హీరోలా తనను తాను ఊహించుకుంటూ సినిమాలు చేయడమే ఈ అశ్విన్ బాబుకు ప్రాబ్లమ్ గా మారుతోంది. తనను తాను ఓ రామ్ చరణ్, ఓ ఎన్టీఆర్ లా ఫీలవుతాడు. అలాంటి యాక్షన్ మూవీస్ చేస్తుంటాడు. రాజు గారి గది3 , హిండిబ తర్వాత ఇప్పుడు శివం భజే (Shivam bhaje) అనే మరో సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు అప్సర్ రూపొందిస్తున్నారు.
శివం భజే టీజర్ లో హీరో మానసిక సమస్యతో ఉన్నట్లు చూపించారు. అతను కొందరితో చేసే యుద్ధం అతనికి కాదు స్వయంగా ఆ శివుడిదే అంటూ చెప్పించారు. ఇక హీరో శివతాండవం చేస్తూ విలన్స్ ను చితక్కొట్టడం చూపించారు. ఇప్పటిదాకా తన సినిమాల్లో దెయ్యాల ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్న అశ్విన్ బాబు..శివ భజేలో దేవుడి ప్రస్థావనతో మూవీ చేశాడు. ఈ బాబుకు సాలిడ్ హిట్ పడితే గానీ ఈ ప్రయోగాలు ఆపడేమో.