మరో రెండు అవార్డ్స్ గెల్చుకుంది ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన బేబి సినిమా. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలవడమే గాదు గామా, దాసరి వంటి పలు అవార్డ్స్ గెల్చుకుంటోంది. ఇప్పుడు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ లో “బేబి” సినిమాకు రెండు పురస్కారాలు దక్కాయి. బెస్ట్ యాక్టర్ గా ఆనంద్ దేవరకొండ, బెస్ట్ డైరెక్టర్ గా సాయి రాజేష్ ఈ అవార్డ్స్ గెల్చుకున్నారు.
మురళీ మోహన్ చేతుల మీదుగా కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ – “బేబి” సినిమా విడుదలై ఏడాది పూర్తయినా అవార్డ్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద పెట్టిన అవార్డ్స్ మా మూవీకి రావడం సంతోషంగా ఉంది. గొప్ప వాళ్ల చేతుల మీదుగా ఈ అవార్డ్స్ తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.