ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన సూపర్ హిట్ మూవీ బేబి ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో సత్తా చాటింది. ఈ సినిమాకు 8 నామినేషన్స్ రాగా అందులో 5 అవార్డ్స్ దక్కాయి.
చదవండి: సక్సెస్ మీట్ చేసుకున్న ‘తిరగబడర సామీ’
వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, బెస్ట్ ఫిల్మ్, తన మ్యూజిక్ తో బేబి కథలోని ఫీల్ ను ప్రేక్షకలకు అందించిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి. ఐదు అవార్డ్స్ లతో బేబి టీమ్ ఫిలింఫేర్ సౌత్ ఈవెంట్ లో సందడి చేసింది. డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మా ఎస్ కేఎన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ శ్రీరామ చంద్ర ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కాంబినేషన్ లోనే బాలీవుడ్ లో బేబి సినిమా రీమేక్ కాబోతోంది.